IIPE: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మించనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ(ఐఐపీఈ-పెట్రోలియం యూనివర్సిటీ) భవన సముదాయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నేడు వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నారు. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మిస్తున్న ఐఐపీఈ శాశ్వత క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. దేశానికి అవసరమైన పెట్రోలియంను వినియోగించేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉత్పత్తి చేయడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషించనుంది. సుమారు 500 మంది ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. వంగలి ఐఐపీఈ స్థలంలో ఈ భూమిపూజ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.
Read Also: Rahul Gandhi : నేడు మధ్య ప్రదేశ్ చేరుకోనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర