NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: పాపవినాశనం ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు..

Bhumana

Bhumana

తిరుమల పాపవినాశనం ఘటనపై మాజీ టీటీడీ బోర్డు చైర్మన్.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “తిరుమల పాపవినాశనం జలాశయంలో బోటింగ్ చేస్తామని మళ్ళీ వెనక్కి తగ్గారు‌.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చిన్న సమస్యను కూడా పెద్దగా చూపించారు.. పవిత్రమైన ప్రాంతాన్ని విహార యాత్రకు అడ్డాగా మార్చాలని చూశారు‌.. పవిత్రమైన పాపవినాశనం జలాలను అపవిత్రం చేశారు‌.. సనాతన ధర్మం కోసం నడుము బిగించినప్పటి నుండి పవన్ కల్యాణ్ కు నడుము నొప్పి వచ్చింది.. పాపవినాశనం ఘటనపై ఎందుకు పవన్ కల్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు.

Also Read:Gun Fire : గుడిమల్కాపూర్‌లో గాలిలో కాల్పులు

తిరుమలలో మద్యం, మాంసం దొరుకుతున్నాయి.. బాలాజీ నగర్ లో మద్యం పట్టుకున్నట్లు పోలిసులు బిల్ డప్ ఇచ్చారు‌.. తిరుమలలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది.. మద్యం, గంజాయి సేవించిన ఇద్దరు యువకులు యాత్రికులను కోట్టారు‌‌‌.. ఇంత జరుగుతున్నా టిడిపి స్పందించడం లేదు‌.. గుట్కా, హాన్స్, గంజాయి అమ్ముతున్నారు.. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేదు.. అటవీశాఖ అధికారి పై ఎందుకు చర్చలు తీసుకోలేదు.. లడ్డు కల్తీ అంటూ అసత్య ప్రచారం చేశారు‌‌.

Also Read:Navdeep : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నవదీప్..సపోర్ట్‌గా మంచు లక్ష్మీ

వైసిపి మీద చేసినా ఆరోపణలు ఒక్కటి నిరూపించలేకపోయారు‌‌.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బిజెపి తిరుమలను నాశనం చేశాయి‌‌‌.. పాపవినాశనం ఘటనపై అటవీశాఖ మంత్రిగా పవన్ సమాధానం చెప్పాలి.. వెదరుకుప్పంలో పంచాయతీ ఆఫీస్ పై టిడిపి జెండా ఎగురవేశారు.. తిరుపతి కొకైన్, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు‌‌. గంజాయి వనంగా తిరుపతిని మార్చారు‌‌‌. చిత్తూరు మురళి రెడ్డిపై ముప్పైమంది టిడిపి రౌడిలు దాడులు చేశారు‌‌‌.