NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..

Bhumana

Bhumana

Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు‌‌.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. ‌‌కోర్టులను సైతం హెచ్చరించేలా మాట్లాడాడు.. కల్లు తాగినా కోతిలా పవన్ స్వామీ మాట్లాడాడు.. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కథ వెనుక చాలా పెద్ద అజెండా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మంలో ఆయన చెప్పినట్లే గోడ్డు మాంసం తినొచ్చు‌‌‌‌‌.. సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్ తెలుసా..? అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్‌తో 561 కి.మీ

ఇక, పవన్ కల్యాణ్ ఒక క్షుద్ర రాజకీయాకుడి‌లా హైందవ మతానికి అన్యాయం చేయాలని చూస్తున్మాడని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవన్ హిందూ జాతీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.. నువ్వు చేసినా ఆరోపణలపై వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేయ్‌‌.. నాలుగు భాషాల్లో మాట్లాడి అరాచకాలను సృష్టించాలని చూస్తున్నాడు‌‌.. పవన్ మనస్సు మొత్తం విషం నిండి ఉంది.. సభలో దేవుడు గురించి మాట్లాడుతానని చెప్పి జగన్ కేసుల గురించి మాట్లాడుతావా.. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు.. మరి పవన్ స్వామీలు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని‌‌‌‌ అని అడిగారు. రాముడిని ఎప్పుడు ఎలా ఆదర్శం తీసుకున్నావ్ ‌పవన్.. పవన్ కల్యాణ్ ప్రశ్నలు చంద్రబాబుకు వేయాలీ‌‌.. మాకు కాదు అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు

అలాగే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం మాకు లేదు‌.. కానీ పవన్ కల్యాణ్ చేస్తే మాకు అభ్యంతరం అని కరుణాకర్ రెడ్డి అన్నారు. పచ్చి రాజకీయ నాయకుడైనా పవన్ స్వామీ చేబితే మేము వినము.. పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది అని విమర్శించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కాషాయం ధరించాడు.. సుప్రీం కోర్టును ప్రభావితం చేయడానికి ఈరోజు పవన్ కల్యాణ్ మాట్లాడాడు.. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో పవన్ స్వామీలు వారి దివ్యశక్తితో కనుక్కోవాలని కోరుకుంటున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Show comments