Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: పవన్ ,చంద్రబాబులపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సింగడు అద్దంకి రానూ వచ్చాడు, పోనూ పోయాడు అన్నట్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి రానూ వచ్చారు, తిరిగి పోనూ పోయారని.. రాసుకోనొచ్చింది కూడా చదవలేక, చదివేసి వెళ్లిపోయారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏమి చెప్పకుండా మరచిపోయి మరీ వెళ్లిపోయారని విమర్శించారు. వీళ్ల తిరుపతి ట్రిప్పుకు, సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదన్నారు.

Read Also: YS Avinash Reddy: నాపై అనవసరంగా వివేకా హత్య కేసు మోపారు..

అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని.. జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారన్నారు. 17 వేల మందికి పైగా ఉద్యోగస్థులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని భూమన పేర్కొన్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి నందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారన్నారు. ఆరణి శ్రీనివాసులు నిన్న కర్నాటక నుంచి అక్రమంగా తెప్పిస్తున్న చీప్ లిక్కర్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని ఆరోపించారు.

Exit mobile version