Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: ఉద్దేశ్య పూర్వకంగా పెద్దిరెడ్డి పై విష ప్రచారం..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా.. ఉద్దేశ్య పూర్వకంగా రాసినా చెల్లుతుందనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు.. తప్పుడు కథనాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు.. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.. కొన్ని మీడియా, పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదని మండపడ్డారు.. కూటమి ప్రభుత్వంపై మా పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోందన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి..

Read Also: Inter 1st Year Exams: సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ యథాతథం

Exit mobile version