తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆశీర్వదించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని అఖండ, అత్యంత మెజారిటీతో గెలిపించండని కోరారు. చంద్రాబాబు సొంత నియోజక వర్గంలో పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండని, ఒక వైపు నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీ కొట్టు మిట్టాడుతోందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్ అయితే వాళ్ల పార్టీ నుంచి చిన్న పోరాటం కూడా జరగలేదని, బంద్ కు పిలుపునిస్తే చంద్రబాబు ఇంటిలోని కారు కూడా నిలవలేదన్నారు. తెలుగుదేశం పార్టీని ఎలా నడిపించాలో కూడా తెలియని, దిక్కు తోచని స్థితిలో ఆ పార్టీ ఉందని ఆయన అన్నారు. పైగా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ వాళ్లు గంటలు కొట్టి, డప్పులు వాయించడం, చప్పుడు చేయడాన్ని చూస్తుంటే సంబరాలు చేసుకుంటున్నట్టు అనిపిస్తోందన్నారు. సాధారణంగా విజయోత్సవాలు, సంబరాలు చేసుకునే సమయం లోనే ఇలాంటివి చేయడం జరుగుతుందన్నారు.
Also Read : Apple iPhone 15: హీట్ అవుతున్న ఐఫోన్ 15 ఫోన్లు.. కారణాలు గుర్తించిన యాపిల్..
ఎప్పుడూ వ్యవస్థలను మేనేజ్ చేయడంతో సరిపోవడం వల్లే ఈ దుస్థితి ఎదురవుతోంది… గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రాష్ట్ర మంతటా పోరాటాలు జరిగాయి… వైఎస్సార్ సీపీ ఉద్యమాల్లో నుంచి పుట్టిన పార్టీ… తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిసినా వైఎస్ జగన్ దేనికీ భయపడని దీరోధాత్తుడు… ఈ సారి ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి , నా తనయుడు అభినయ్ ఇద్దరూ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, గెలిపించండి…’ అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
Also Read : PM Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..