Bhole Baba : వందలకోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు..హత్రాస్ బాబా నిజస్వరూపం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhole Baba : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనకు చెందిన సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు కనీసం రూ.100 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు, అతనికి దాదాపు 24కు పైగా ఆశ్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాబా వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయని ఈ విషయంలో నిపుణులు అంటున్నారు. విశేషమేమిటంటే బాబా ఆదాయ వనరు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎందుకంటే అతని అనుచరులలో ఎక్కువ మంది పేదవారు. ప్రస్తుతం పోలీసులు బాబా కోసం వెతుకుతున్నారు. మంగళవారం సత్సంగం అనంతరం జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. తొక్కిసలాటను సృష్టించింది ‘సంఘవ్యతిరేక శక్తులే’ అని బాబా ఆరోపించారు.
Read Also:Hathras Case: హత్రాస్ ఘటనలో ‘భోలే బాబా’ అరెస్ట్ అవుతారా..? ఐజీ సమాధానం ఇదే..!
Also Read
- SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
- Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
- Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
- Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
బాబా జనాల మధ్యకు వచ్చినప్పుడు తెల్లటి త్రీ పీస్ సూట్, టై, స్టైలిష్ గాజులు ధరిస్తారు. అతను ఒంటరిగా కాకుండా మొత్తం కాన్వాయ్‌తోనే ఎక్కడికైనా వెళ్తారు. ఇందులో 350 సీసీ మోటార్‌సైకిళ్లపై 16 మంది కమాండోలు ఉంటారు. బాబా కాన్వాయ్‌లో 15 నుంచి 30 వాహనాలు ఉన్నాయి. బాబా సేవకులు లేత గులాబీ రంగు దుస్తులు ధరించి చేతిలో లాఠీలతో నిలబడి కాన్వాయ్‌కు దారిని సిద్ధం చేస్తుంటారు. ఇప్పటి వరకు అతని పై ఎవరూ సినిమాలు తీయకుండా, ఫొటోలు తీయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బాబా వైట్ కలర్ టయోటా ఫార్చ్యూనర్ వాడుతుంటారు.
Read Also:Rohit Sharma: టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా ఎవరికి చెప్పాడో తెలుసా?
బాబా భక్తుడైన అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బాబా భద్రత కోసం పోలీసులను నమ్ముకోలేదు.. తన భద్రతను చూసుకునే వేలాది మంది సేవకులపై ఆధారపడ్డాడు. బాబా సేవకుడిగా మారాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాతనే సెలక్షన్ ఉంటుంది. వారికి జీతాలు, ఆహారం, వసతి అన్నీ ఆశ్రమంలోనే ఉంటాయని తెలిపారు. భోలే బాబా 21 బిఘాలలో విస్తరించి ఉన్న హరి నగర్ అనే మెయిన్‌పురి ఆశ్రమంలో నివసిస్తున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే ఈ ఆశ్రమంలో కేవలం బాబా, ఆయన భార్యకు మాత్రమే ఆరుగదులు ఉంటాయి. మెయిన్‌పురి ఆశ్రమం ప్రవేశం వద్ద ఒక బోర్డు ఉంటుంది, దానిపై దాతల సమాచారం రాస్తారు. విశేషమేమిటంటే రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు దాతలు ఈ జాబితాలో ఉన్నారు. శ్రీ నారాయణ్ హరి సాకర్ ఛారిటబుల్ ట్రస్ట్ గత సంవత్సరం మాత్రమే స్థాపించారు. ఇప్పుడు దాని ఇతర అనుబంధ ట్రస్టుల ప్రాంతంలో ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. కాన్పూర్‌లోని బిద్నులో సేవాదార్లు నివసించే ఆశ్రమం ఉంది. భూపత్ సరాయ్లో మరో ఆశ్రమం నిర్మాణం జరుగుతోంది. ఇది 15 బిఘాల్లో కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉందని సమాచారం. పాటియాలీలో ఒక ఆశ్రమం కూడా ఉంది, ఇది 29 బిఘాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
తాజావార్తలు
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!