Bhola shankar : మెగాస్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి..ఈఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో భారీ విజయం సాధించడానికీ సిద్ధంగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలతో రూపొందిన భోళా శంకర్ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది.దీనితో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ సందడి మొదలైంది.
ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.ముఖ్యంగా ఇందులో చిరంజీవి లుక్స్ మరియు స్టైల్ మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పించింది.. దీంతో ఈ సినిమాను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అలాగే భోళా శంకర్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రమోషన్స్ కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తుంది.. మెగా అభిమానులను బాగా ఆకట్టుకునేందుకు సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. భోళా శంకర్ పై బాగా హైప్ క్రియేట్ అవ్వడానికి చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ మెగాస్టార్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేసింది.తెలంగాణలోని సూర్యపేటలో విజయవాడ మరియు హైదరాబాద్ హైవే పక్కన రాజు గారి తోట వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ . ఈ కటౌట్ తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలోనే చాలా పెద్దది అని తెలుపుతూ ఆ భారీ కటౌట్ ఫోటో ను షేర్ చేసింది. అయితే కటౌట్ ఎన్ని అడుగులు ఉందనేది మాత్రం వారు వెల్లడించలేదు. ప్రస్తుతం చిరు భారీ కటౌట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..