మెగా స్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.భారీ అంచనాలతో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు కూడా భారీ గా బజ్ క్రియేట్ అయ్యే లా మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించారు.కానీ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు మాత్రం ఆ విధంగా బజ్ క్రియేట్ అవ్వలేదు.భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడు మొదలు పెడుతారో క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి కు చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.భోళా శంకర్ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
భోళా శంకర్ సినిమా నుండి వచ్చిన పాటలు మరియు టీజర్ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి అని తెలుస్తుంది.సినిమాకు పై మరింత క్రేజ్ పెరగాలి అంటే మరో ఇంట్రెస్టింగ్ టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. వారు కోరుకుంటున్నట్లుగానే భోళా శంకర్ నుండి మరో ఇంట్రెస్టింగ్ డైలాగ్ ప్రోమో ఒకటి రాబోతుందనీ సమాచారం.ఈ డైలాగ్ ప్రోమో తో భోళా శంకర్ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ సినిమా లో చిరంజీవి పాత్ర ను విభిన్నం గా చూపించాడు దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమాలో చిరంజీవి తెలంగాణ యాస లో అదరగొట్టాడు. బోళా శంకర్ సినిమా నుండి ఒక సర్ప్రైసింగ్ డైలాగ్ ప్రోమో ఇదే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఆ డైలాగ్ ప్రోమోతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.