Site icon NTV Telugu

Bhogi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు.. పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు

Bhogi

Bhogi

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని.. వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో ప్రజలు సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు.

Read Also: Gold Rate Today: పండుగ వేళ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

ఇక, నగరి లో మంత్రి రోజా నివాసంలో భోగి వేడుకలు జరిగాయి. అలాగే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గంలో భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అదేవిధంగా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక సాంగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒంగోలు లాయర్ పేట సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసిన కార్యకర్తలు.. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు, శివబాలజీ పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=p587FuLxDRQ

Exit mobile version