Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

Kgbv

Kgbv

Girls Hair Cutting: జిల్లా భీమిలి కేజీబివిలో ఆకతాయిల చర్య వివాదస్పదంగా మారింది. నిద్రలో ఉన్న విద్యార్థిల జుత్తు కత్తిరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులు స్కూల్లోకి ప్రవేశించే ఆస్కారం లేకపోవడంతో తోటి స్టూడెంట్స్ ఈ చర్యకు పాల్పడి ఉంటారని యాజమాన్యం అనుమానిస్తుంది. ఇందుకు బాధ్యులైన వారిని ఇప్పటికే గుర్తించినట్టు తెలిసింది. పోలీసులు సూచనతో తల్లిదండ్రుల సమక్షంలోనే విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించింది యాజమాన్యం. ఇందుకోసం పేరెంట్స్ ను మీటింగ్ కోసం పిలిపించారు అధికారులు.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థినిల జడలు కత్తరించడం కలకలం రేపింది. తరగతిలో మొత్తం 38 మంది విద్యార్థిలు ఉన్నారు. వీరిలో 20 మంది ఒక గదిలో 18 మంది మరో గదిలో నిద్రిస్తారు. బుధవారం రాత్రి 12 గంటల వరకు వర్డన్ పర్యావేక్షణలోనే విద్యార్థులు ఉన్నారు. ఒక గదిలో నిద్రిస్తున్న ఆరుగురి జడలను, మరో గదిలో నిద్రిస్తున్న నలుగురు జడలను కత్తిరించినట్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు అందింది. ఒక్క జడ వేసుకున్న బాలికల జడనే కత్తిరించడంతో ఇది ఆకతాయిల పనేనని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే భీమిలి పోలీసులు విద్యార్థులను విచారించగా తమకు తెలియదనే సమాధానం చెప్పారని ప్రిన్సిపల్ వెల్లడించారు.