Cyber Crime: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా భీమవరంకు చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరించి రూ. 73 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన రుద్రరాజు రంగప్రసాదరాజుకు డీసీఎల్ కొరియర్ కాల్ అంటూ ఫోన్ చేశారు. మీ పేరు మీదే నాలుగు పాస్ పోర్టులు, నాలుగు ఏటీయం కార్డులు, ఒక ల్యాప్‌టాప్, డ్రగ్స్ వచ్చాయని కాల్ ద్వారా తెలిపారు.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
అనంతరం బొంబాయి సైబర్ క్రైమ్ పోలీసులం అని ఫోన్ చేసి కేటుగాళ్లు వివరాలు తీసుకున్నారు. రంగప్రసాదరాజు అకౌంట్స్‌లోని డబ్బు తమకి పంపితే పరిశీలించి తిరిగి వేసేస్తామని సైబర్ నేరగాళ్ళు నమ్మించారు. ఈ విషయాన్ని నమ్మిన రంగప్రసాదరాజు తన మూడు బ్యాంక్ అకౌంట్ల నుంచి 73లక్షల 20 వేలను బాధితుడు కేటుగాళ్ల అకౌంట్లలో వేశాడు. వాళ్లు తిరిగి తన ఖాతాలో డబ్బులు వేయకపోవడంతో మోసపోయానని తెలుసుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో భీమవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు