BHIMAA : యాక్షన్ మోడ్ లో గోపీచంద్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా లో దింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది..తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది..రామబాణం నిరాశపరచడం తో గోపిచంద్ కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తో తన 31 వ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి భీమా టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట బాగా వైరల్ అయింది..
తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మ్యాచో స్టార్ గోపీచంద్ అభిమానుల కోసం యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా స్టైలిష్ అవతార్ లో కనిపిస్తూ.. రౌడీల తో సవారి చేస్తున్నట్టు గా ఉన్న లుక్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తోంది. హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం లో గోపీచంద్ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ లో గోపీచంద్ ఖాకీ డ్రెస్ లో రౌద్రరూపం చూపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తోన్న ఎద్దు స్టిల్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు స్వామి జే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహారిస్తున్నారు..ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా తో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని గోపీచంద్ ఎంతో ధీమా గా వున్నాడు..
Also Read
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
- EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
- Tags
- bhimaa
- Gopichand
- Latest Movie
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!