NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం.. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి కొత్త గూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. వర్ష కాలం నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఆ తరువాత సహచర మంత్రులతో కలిసి మనుగూరు బయలుదేరి వెళ్లి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరామర్శించారు. అదే విధంగా ఇటీవల స్వర్గస్థులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహీత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరమార్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని, గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు.. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు.. అయినా ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం, రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం గత పదేళ్లు పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచారు, 7 లక్షల కోట్ల అప్పు చేసి.. పారిపోయారు. రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం త్వరలో శుభవార్త వింటారు. కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.