NTV Telugu Site icon

Bhatti Vikramarka : బాలిక మృతదేహాన్ని బైక్‌పై తీసుకురావడం దారుణం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి గ్రామాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఇటీవల కాలంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అనారోగ్యంతో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించిన ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక మృతదేహాన్ని బైక్‌పై తీసుకురావడం దారుణమన్నారు.

Also Read : క్యాన్సర్ ఎన్ని రకాలు? మీకు తెలుసా..?
కొత్త మేడేపల్లి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, రహదారి త్రాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసి గిరిజనులు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు కనీసం మౌలిక వసతులు కల్పించలేదని ఆయన మండిపడ్డారు. కొత్త మేడిపల్లి సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.