Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Says Farmers Not Interested In Pm Kusum Scheme Telangana Solar Power Push

Bhatti Vikramarka: పీఎం కుసుమ్‌కు రైతులు ఆసక్తి చూపించడం లేదు!

Published Date :January 5, 2026 , 12:34 pm
By Sampath Kumar
  • విద్యుత్ శాఖలో చాలా సంస్కరణలు తీసుకువచ్చాము
  • అడిగిన వారికి ట్రాన్స్ ఫార్మర్స్ ఇస్తున్నాం
  • పీఎం కుసుమ్‌కు రైతులు ఆసక్తి చూపించడం లేదు
Bhatti Vikramarka: పీఎం కుసుమ్‌కు రైతులు ఆసక్తి చూపించడం లేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో సోలార్ పవర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గృహ అవసరాలకే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకానికి ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రావడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్ కోసం ఇంటి మీద రూఫ్ ఏర్పాటు చేయాల్సి రావడం కూడా ప్రజలు వెనకడుగు వేయడానికి కారణమవుతోందని చెప్పారు.

పీఎం కుసుమ్‌ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కొడంగల్, బొనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సోలార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ అందుతుందని, మొత్తం పథకం వ్యయం సుమారు రూ.519 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రెడ్కో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అదేవిధంగా 20 లక్షల విద్యుత్ కనెక్షన్లను పీఎం సూర్య ఘర్ పథకంతో అనుసంధానం చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చర్చించామని తెలిపారు.

స్వయం సహాయక సంఘాలకు పొలాల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, లీజు భూముల్లో ఈ సదుపాయం కల్పించలేమని కేంద్ర నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ కారణంగా రైతులు కూడా పీఎం కుసుమ్ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నారు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ పథకాలను అమలు చేసి సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ సభ్యులు సహకరించాలని కోరారు.

Also Read: Phone Tapping Case:: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టులో హరీష్ రావుకు ఊరట!

‘ట్రాన్స్ ఫార్మర్స్, వ్యవసాయ పంపు సెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 3,48,462 మంది దరఖాస్తు చేసుకున్నారు. 75 పైచిలుకు ట్రాన్స్ ఫార్మర్స్ మంజూరు చేశాం. విద్యుత్ శాఖలో చాలా సంస్కరణలు తీసుకు వచ్చాము. 1912 కు ఫోన్ చేస్తే ఎలక్ట్రికల్ అంబులెన్స్ ద్వారా ఫిర్యాదు చేసిన ప్రాంతానికి వెళ్లి సమస్య పరిష్కారం చేస్తారు. అడిగిన వారికి ట్రాన్స్ ఫార్మర్స్ ఇస్తున్నాం. గత కొంతకాలంగా విద్యుత్ శాఖలో ప్రజా బాట నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గత ఏడాది 56807 spdcl పరిధిలో కొత్త కనెక్షన్లు, ఎన్పిడీసీఎల్లో 41 086 కనెక్షన్లు.. మొత్తంగా 97893 కొత్త కనెక్షన్లు ఇచ్చాము. ఈ ఏడాదిలో మరో 20 వేల కొత్త కనెక్షన్లు ఇస్తాం. రాష్ట్రంలో ట్రాన్స్ ఫార్మర్స్ కొరత లేదు’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • PM Surya Ghar Scheme
  • PM-KUSUM Scheme
  • telangana
  • telangana farmers

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions