Site icon NTV Telugu

Bhatti Vikramarka : వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్ కో ఇంచార్జ్ సిఎండి సయ్యద్ ముర్తుజా రిజ్వీ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు రామగుండం ఎన్టిపిసి ఫేజ్-2 లో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఎన్టిపిసితో సంప్రదింపులు జరపాలని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టిపిసి ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఎన్టిపిసి నిర్మాణం చేస్తున్నదని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Exit mobile version