NTV Telugu Site icon

Bhatti Vikramarka : కేసీఆర్ భవిష్యత్‌లో మేము చేసేది చూస్తారు

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే.. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్దతో మాట్లాడుతూ.. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..? అని, కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారన్నారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారని, వారు మాకేంటి సమయం ఇచ్చేది..? అని ఆయన అన్నారు. ప్రజలే వారికి విశ్రాంతి తీసుకోమని సమయం ఇచ్చారని, పక్క రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి తెచ్చిందే రాష్ట్ర విభజన చట్టం అని కేసీఆర్‌పై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు అంతా మహారాణులుగా చూస్తామని ఆయన అన్నారు.

MP: ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

అంతేకాకుండా.. ‘దళిత బంధుకు గత సర్కార్ 7 వేల కోట్లు పెట్టీ… ఒక్క పైసా విడుదల చేయలేదు. ఆయన ఇప్పుడు దళిత బందు ప్రస్తావన లేదు అంటున్నాడు. కేసీఆర్ భవిష్యత్ లో మేము చేసేది చూస్తారు. గతంలో లాగ పాలన గాలికి వదిలేయలేదు. రెవెన్యూ వచ్చే శాఖల తో ప్రతి శుక్రవారం సమీక్ష చేస్తున్నాం. రుణమాఫీ కి డబ్బులు ఎక్కడివి అన్నారు… కానీ మేము చేసి చూపిస్తున్నాం. నూతన విధానం చెప్పేదే పాలసీ. విద్య..మహిళలకు రుణాలు ఇస్తాం అనేది మా పాలసీ. ఏం చిల్చుతాడు.. ఏం చెండాడుతాడు. వ్యవసాయానికి 72 వేల కోట్లు పెడితే… ఇంకా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా. అడ్డగోలుగా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా..? మీరు 26 వేల కోట్లు పెడితే..మేము 72 వేల కోట్లు వ్యవసాయం కి పెట్టినాం. మేము రైతుల వైపు గట్టిగా నిలబడాలి అనుకున్నాం కాబట్టి బడ్జెట్ కూడా గట్టిగా ఒత్తి ఒత్తి చదివాము. పదేళ్లు మహిళలకు రుణాలు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు మేము ఇస్తాం అంటే గాలి మాటలు మాట్లాడుతున్నారు.’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు