సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర హనుమకొండ జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ సందర్భంగా.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర ఎన్నికల కోసమో రాజకీయాల కోసం కాదని తెలిపారు. కేసీఆర్ పాలనలో నలిగిపోతున్న ప్రజలను ఓదార్చడానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సోనియా గాంధీ అటవీ హక్కుల చట్టం తీసుకువస్తే బీఆర్ఎస్ వాళ్లు రావాల్సిన వాటా మాకు రానివ్వడం లేదన్నారు.
Also Read : Shocking Incident: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ర్యాపిడో డ్రైవర్.. బైక్ పై నుంచి దూకేసిన వైనం..వీడియో వైరల్
కేసీఆర్ పాలనలో 9 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే కాకుండా, పేపర్ లీక్ చేసిన బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ బంధు కూడా తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల వరకు పెంచడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఆయన అన్నారు.
Also Read : Arnold: 75 ఏళ్ళ వయసులో ఆర్నాల్డ్ ‘బ్రేకౌట్’!
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేర్ల మీద అప్పు చేసి పెట్టిన ఐదు లక్షల కోట్లతో రాష్ట్ర ప్రజలకు చిన్న ఫలితం కూడా రాలేదని ఆరోపించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో ఏర్పడిన క్రమంలో తెలంగాణలో రెండో రాజధాని అయిన వరంగల్ అభివృద్ధి చెందుతుందని ఆశించామని, అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందన్నారు.
