తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన , ఎందరు కుటిల ప్రయత్నాలు చేసినా ఎగ్జామ్ నిర్వహించాలని దృఢ నిశ్చయం తో ముందుకు వెళ్ళామన్నారు. ఈ ప్రభుత్వం మనది మీది అని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామన్నారు. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించామని, పరీక్షల నిర్వహణకు నిధులు విడుదల చేశామన్నారు.
Andhra Pradesh: 50 వేలు దాటిన మద్యం షాపుల దరఖాస్తులు.. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం
జాబ్ క్యాలెండర్ ను తూచ తప్పకుండా పాటించే ఏకైక ప్రభుత్వమన్నారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తాం…. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ముందుకు పోతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం నిలబెట్టేందుకు కలిసి నడుద్దామని, ప్రపంచంతో పోటీ పడేలా పని చేద్దామన్నారు. డీఎస్సీని ప్రకటిస్తే ధర్నాలు చేసి ఆపించాలని కుటిల ప్రయత్నాలు చేశారని. వాళ్ల కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టి ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా భట్టి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇస్తున్నామని.. ఇంతకంటే ఆనందం మాకు మరొకటి లేదని..ముందుగా చెప్పిన సమయానికి నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు.
Stock market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్