Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఈ నెల 30 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

మధిరలో మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జానకీపురం గ్రామంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు. నేనిక్కడే ఉంటాను.. నాకు ఓటేయండని బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని, బీఆర్ఎస్ పార్టీనే ఉండడం లేదు.. ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కండుంటారు..? అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని, రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Sanjay Raut: ‘‘మోడీ బౌలింగ్.. అమిత్ షా బ్యాటింగ్’’.. సంజయ్ రౌత్ సెటైర్లు..

ఆరోగ్య శ్రీ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. రోడ్లేసింది కాంగ్రెస్ అని, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని, అభివృద్ధి చేయని బీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు భట్టి విక్రమార్క. అంతేకాకుండా.. సంపదను పేదలకు పంచబోతున్నామన్నారు భట్టి విక్రమార్క. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని ఆయన విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇస్తున్నారు. ఆరు హామీలకు సంబంధించి భట్టి విక్రమార్క గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరు హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల గురించి ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు.

Also Read : Bandi Sanjay : కేసీఆర్‌పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్

Exit mobile version