NTV Telugu Site icon

Bhatti Vikramarka : కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేరు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వేళ ఒకరిపైఒకరి నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్‌ అధినేతే, సీఎం కేసీఆర్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గెలవరంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కామెంట్లకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్ అనే ఓ బండ రాయిని.. రత్నం అనుకుని పదేళ్లు నెత్తిన పెట్టుకున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. రాయేదో రత్నమేదో తెలంగాణ ప్రజలకు తెలుసు అని, మధిర రత్నాన్ని హైదరాబాదులో పెడతారన్నారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించడం లేరని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ నన్ను ఓడించాలని కేసీఆర్ ఇలాగే ప్రయత్నించారు.. కానీ సఫలం కాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 సీట్లే వస్తాయని కేసీఆర్ భావిస్తే.. కాకిలా ఎందుకు తిరుగుతున్నారన్నారు భట్టి విక్రమార్క.

Also Read : Vaishnav Tej: పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ విషయమే చెప్పారు..

అంతేకాకుండా..’నన్ను గెలిపించండి.. నా అభ్యర్థిని గెలిపించండని కేసీఆర్ లెక్కకు మిక్కిలిగా సభలు పెడుతున్నారు. తానే గజ్వేల్లో గెలవలేనని కామారెడ్డి వెళ్లిన కేసీఆర్.. కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పడం హస్యాస్పదం. తెలంగాణ సీఎం ఎవరో మా అధిష్టానం నిర్ణయిస్తుంది. సీఎంగా ఉండి కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. సీఎల్పీ నేతగా నా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూనే రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాను. దళిత బంధు అమలు విషయంలో కేసీఆర్ నన్ను ఆహ్వానించింది నిజం కాదా..? దళిత బంధు అమలు విషయంలో నేను సూచనలు చేసింది నిజం కాదా..? దళిత బంధును కేసీఆర్ ఎస్సీ వర్గం ఓట్ల కోణంలో మాత్రమే చూశారు.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Also Read : Air India: విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన కాసేపటికే..