Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో భారీ అంకెలు కనిపించాయి, కానీ కొత్తేమి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు, సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు భారీ లెక్కలు చూపించిందని భట్టి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల లెక్కలు బడ్జెట్‌లో లెక్కలు చూపించలేదన్నారు. రుణమాఫీకి నిధులు కేటాయించలేదు, 24 గంటల కరెంట్ అబద్ధమని ఆయన విమర్శలు గుప్పించారు. బీసీలకు 6వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారన్నారు.
8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు. రుణమాఫీ సరిగ్గా చేయకపోవడంతో 16లక్షల మంది రైతుల అకౌంట్స్ ఎన్‌పీఏగా మిగిలిపోయాయన్నారు. నిరుద్యోగ భృతి, గిరిజనబంధు ఊసే లేదన్నారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్‌లో బాగా కనిపించిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నాలుగు సూత్రాలు బడ్జెట్‌లో కనిపించలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. కలల బడ్జెట్ మాత్రమే…వాస్తవ బడ్జెట్ కాదన్నారు.
KTR: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి.. 4లక్షల ఉద్యోగాలు
బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా విమర్శలు గుప్పించారు. హరీష్ రావు బడ్జెట్ అంకెల గారడీలా ఉందన్నారు. పరనింద, అభూతకల్పనతో పెట్టిన బడ్జెట్ లాగా కనిపిస్తోందన్నారు. గత బడ్జెట్ నిధుల అమలు జరిగిందా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఎన్నికల కోసం కేవలం అంకెలు చూపించే బడ్జెట్ మాత్రమేనని ఆయన మండిపడ్డారు.