Site icon NTV Telugu

Bhatti Vikramarka : కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు తలదించుకునేలాగుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా ఏర్రుపాలేం మండలం రాజుదేవరపాడులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ అనుచితంగా మాట్లాడ్డం రాష్ట్ర ప్రజలు తలదించుకునే ఉందని ఆయన మండిపడ్డారు. ఈడీలు సీబీఐలు వెంటపడుతుంటే ఢిల్లీ వెళ్లి బీజేపీతో అంట కాగిన కేటీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

Also Read : V.Hanumantha Rao : పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమయ్యింది

పబ్బులతో క్లబ్బులతో తెలంగాణను చిన్నాభిన్నం చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాదును గంజాయి మత్తులో తూగెలా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి అవకాశం వస్తే తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, జాతీయ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Also Read: Spain wildfires: స్పెయిన్‌ అడవుల్లో కార్చిచ్చు.. బుగ్గిపాలైన 3 వేల భవనాలు

అంతేకాకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను తీర్చకుంటే 4 నెలలు ఓపిక పట్టాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం దారి పొడువునా చాలా సమస్యలు చూస్తూ వచ్చానని తెలిపారు. పంచాయతీ కార్మికులు 12 రోజులుగా మీరు చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు.

తాను చాలా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించానని భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. సమస్యల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పారు భట్టి విక్రమార్క.

Exit mobile version