NTV Telugu Site icon

Bhatti Vikramarka : జార్ఖండ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం భట్టి బిజీ బిజీ

Bhatti

Bhatti

Bhatti Vikramarka : ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం రాంఘడ్ నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్ లలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంటింటి ప్రచారం ,బూత్ లెవల్ మీటింగ్స్ ఏర్పాటు,సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలపై స్థానిక బ్లాక్ కాంగ్రెస్ నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాంఘడ్ అసెంబ్లీ నియోకవర్గ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మమతా దేవి నీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, భావ ప్రకటన, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం ఉండాలని రాజ్యాంగాన్ని రచించుకొని శాసనంగా రూపొందించుకున్నామని ఆ లక్ష్యం అందరికీ అందాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు కీలకమని పార్టీ నేతలకు సూచించారు.

Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం

గత మూడు రోజులుగా డిప్యూటీ సీఎం ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బిజీబిజీగా గడిపారు. మొదటిరోజు స్థానిక పిసిసి నేతల తో సమావేశమై రామ్ గడ్, బొకారో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. స్థానిక డిసిసి అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. రెండో రోజు రాంచీలో aicc జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తో కలిసి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ కూటమి మేనిఫెస్టో పై కెసి వేణుగోపాల్ తో పాటు స్థానిక నేతలతో కలిసి కసరత్తు చేశారు. శనివారం రామ్ గాడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దుల్మీ, చిత్తర్ పూర్, గోలాస్ బ్లాక్ లో పర్యటించి స్థానిక నేతలకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం తో పాటు ఏఐసీసీ మెంబర్ సుధాకర్ రెడ్డి,మైనారిటీ సెల్ అధ్యక్షులు తారిఖ్ అన్వర్, కాంగ్రెస్ మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షాజాద్ అన్వర్,రాంఘర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బజరంగ్ మహతో, జిల్లా అధ్యక్షుడు మున్నా పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?

Show comments