NTV Telugu Site icon

Bhatti Vikramarka : దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారు

Bhatti

Bhatti

Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

Zomato: జీతం లేదు.. పైగా 20లక్షల ఫీజు.. వింతైన జాబ్‌కు ఎంతమంది దరఖాస్తు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

రాష్ట్ర సంపద పూర్తిగా ప్రజలకే చెందాలని తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్న విక్రమార్క, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో బిలియన్ డాలర్ల లంచం, మోసం ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదానీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదానీపై విచారణ జరగదని, ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దల మద్దతు ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Satya Dev: ‘జీబ్రా’ నా అదృష్టం..కొత్త ఎక్స్ పీరియన్స్ : హీరో సత్యదేవ్