Site icon NTV Telugu

Bhatti Vikramarka : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకోసం ఉచిత శిక్షణ

Bhatti

Bhatti

15 రోజుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నిపుణులైన లెక్చరర్ లతో పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ భట్టి విక్రమార్క. ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్ పెట్టే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలన్నీ గుర్తుచేసుకొని కేటాయింపులు చేశానన్నారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నాటి నుంచి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వడ్డీ మాఫీ చెక్కులను అందించేందుకు భారీ సభ నిర్వహించాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ధృవీకరించిన సీఎం సిద్ధరామయ్య..

మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహించే మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు బకాయి లేకుండా ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది రోజుల్లోనే గ్రూప్ 1నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు. రాష్టంలో ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ఈ ప్రభుత్వా లక్ష్యమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట.. ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎవరిని మోసం చేయాలని ఆలోచన తమకు లేదన్నారు. పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం కడుపుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ పార్టీ మరో వందేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు.

USA: పుతిన్ అణు వ్యాఖ్యలపై అమెరికా ఫైర్

Exit mobile version