భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అజాది కా అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా అజాది గౌరవ్ పేరిట స్వాతంత్ర్య వేడుకలు జరుపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా నేడు దేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిచిందని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ఏఐసీసీ ఆదేశాల మేరకు 9వ తేదీ నుంచి అని జిల్లాలలో అజాది గౌరవ్ పాదయాత్రలు ప్రారంభించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ప్రతి జిల్లాలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్రలు జరగాలని ఆయన వెల్లడించారు. కనీసం 75 కిలోమీటర్లు కనీసం 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజక వర్గాలలో కలిసే విధంగా యాత్రలు చేపట్టాలన్నారు.