రాష్ట్ర వ్యాప్తంగా ‘సెల్పీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్’ అనే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలోనే.. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో.. ఉచిత కరెంట్ ఫైలుపై సంతకం చేసిన వైఎస్ ఫోటో తో సెల్ఫీ దిగారు యాష్కీ. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ అని, కాంగ్రెస్ ఏం ఇచ్చింది అనే వారికి సమాధానం ఇదేనని ఆయన అన్నారు. ప్రాజెక్టుల వద్దకు కూడా వెళ్ళి సెల్ఫీ దిగి జనంకి చెప్పుతామన్నారు. ఉచిత కరెంట్ మా పేటెంట్ అన్న భట్టి విక్రమార్క.. తగుదునమ్మ అని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Also Read : MLA Sudhakar: పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ నమ్మొద్దు.. ఆయన్ను సినిమా వరకే చూడండి
సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టామని, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తుంది బీఆర్‌ఎస్ అని ఆయన విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేసే కేసీఆర్.. కేటీఆర్..హరీష్ లకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. కేసీఆర్ కి సోయి ఉందా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుంది, అక్కడి అవసరానికి వేసులు బాటు ఇస్తారు, కేసీఆర్ కి పిచ్చి ముదిరి మట్లాడుతున్నారు అని భట్టి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో 24 గంటలు కరెంట్ ఇస్తామని ఈ మేరకు భట్టి హామీ ఇచ్చారు. సెల్ఫీ లు.. కేసీఆర్ కి.. మేమే ఇచ్చాం అనే వారికి కూడా ట్యాగ్ చేస్తామని, ఉచిత విద్యుత్ కేసీఆర్ పాలసీ కాదు.. మా పాలసీ అని ఆయన అన్నారు. మెట్రో ఇచ్చింది మేము అని, అక్కడ కూడా సెల్ఫీ ప్రోగ్రాం పెడతామన్నారు. మెట్రో ఎలా వచ్చింది… ఏంటి అన్నది చెప్తామని, ఓఆర్‌ఆర్.. ఎయిర్ పోర్ట్..పరిశ్రమలు… ప్రాజెక్టు ల దగ్గర కూడా సెల్ఫీ దిగుతామన్నారు. మాకు ఎవరూ పోటీ కాదు..పోటీ గా అజెండా ఉండదని, బీఆర్‌ఎస్ ఎత్తిపోయిన పార్టీ.. ఎత్తి పోతున్న పార్టీ అది అని, వాట్సప్ డీప్ లు పెట్టండన్నారు. సోషల్ మీడియా లో ప్రచారం చేయండని పార్టీ నాయకులకు సీఎల్పీ నేత భట్టి పిలుపునిచ్చారు.
Also Read : BRO Pre Release Event Live: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్
