Site icon NTV Telugu

Bhatti Vikramarka: బీఆర్ఎస్ సర్కార్ను కదిలించిన భట్టి పాదయాత్ర.. కాంగ్రెస్లో సరికొత్త ఊపు

Bhatti

Bhatti

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీఆర్ఎస్ సర్కారును కదిలించింది. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ ను ప్రజల వద్దకు పరుగులు తీసేలా చేసింది. పోడు భూముల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఈనాడు పట్టాలు పంపిణీ చేయడం పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై భట్టి చేసిన పోరాట ఫలితమే. ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది. నిరంకుశ నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పీఠాలను కదిలిస్తోంది. అందుకనే భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

Read Also: Viral Video : దోసను ఇలా కూడా చేస్తారా.. దేవుడా చంపెయ్యండి రా బాబు..

తెలంగాణ రాష్ట్రాన్ని 109 రోజుల్లో చుట్టి ముట్టేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ లో సరికొత్త ఊపు తీసుకువచ్చింది.‌ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్విరామంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించి సక్సెస్ కావడం ప్రత్యర్థి పార్టీలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. తెలంగాణకు దిక్సూచిగా మారిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారానికి చేరువ చేయడానికి దోహదపడడంతో ఇతర పార్టీల నాయకులు చెయ్యి అందుకోవడానికి సిద్ధమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జనలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ లో చేరుతుండటమే ఇందుకు నిదర్శనం.

Read Also: The age of consent: మహిళల సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16కి తగ్గించాలి.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల్లో కొనసాగిన భట్టి విక్రమార్క పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరిగింది. భట్టి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న తీరు దివంగత వైఎస్సాఆర్ ను తలపిస్తుండటంతో క్షేత్రస్థాయి నుండి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత సుదూర ప్రయాణంలో ఎక్కడ తన స్వోత్కర్ష లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందో చెప్పుకుంటూ వెళ్ళడం ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనం. ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఇంటింటా సౌభాగ్యం నెలకొనాలని.. నాటి వైఎస్సార్ బాట లోనే భట్టి విక్రమార్క ప్రజల కష్టాలను వింటూ వారికి కాంగ్రెస్ పార్టీ ఉందనే భరోసాను కల్పిస్తూ పాదయాత్ర చేయడం విశేషం.

Exit mobile version