NTV Telugu Site icon

Bhatti Vikramarka: గెలుపు తీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి.. పాదయాత్రతో పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

Bhatti 2

Bhatti 2

ఏఐసీసీ దిశా నిర్దేశంలో మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై 1న ఖమ్మంకు చేరుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వేందర్ సింగ్ సుఖ్, తమిళనాడు సీఎల్పీ లీడర్ సెల్వా పేరుతుంగై, చత్తీస్ ఘడ్ ఇంఛార్జి ఎంపీ రంజిత రంజన్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, టీపీసీసీ నాయకులు ప్రతి పాదయాత్రలో పాల్గొని కదం తొక్కడం కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త జోష్ ను నింపింది.

Read Also: MLA Muthireddy Yadagiri Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భావోద్వేగం.. నా బిడ్డ, అల్లుడిని ప్రేరేపించడం అధర్మం..!

తెలంగాణలోని 17 జిల్లాల్లోని బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మపురి, పెద్దప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధన్నపేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, ఆలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, పాలేరు, ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని నేడు ఖమ్మంలో జరిగే తెలంగాణ గర్జన సభకు చేరుకున్నది.

Read Also: Viral Video : దోసను ఇలా కూడా చేస్తారా.. దేవుడా చంపెయ్యండి రా బాబు..

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్రజ‌లు భ‌ట్టి విక్రమార్కను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్ర సాగింది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్టడుగు, అణ‌గారిన వ‌ర్గాలు తిరిగి పార్టీకి ద‌గ్గర చేయ‌డంలో భ‌ట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింద‌ని చెప్పవ‌చ్చు. కర్నాటక ఎన్నికల తర్వాత భట్టి పాదయాత్రతో తెలంగాణలోని అధికార బీఆర్ఎన్, బీజేపీలు నిస్తేజంగా మారాయి. భట్టి పాదయాత్రకు అడుగడుగున బ్రహ్మరధం పడుతుండటంతో తెలంగాణలో ఆ రెండు పార్టీలకు ప్రజాదరణ తగ్గుతుండటం ఆయా పార్టీలలో ఆందోళనకు గురిచేస్తుంది. ఇదే సమయంలో భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నుండి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

Read Also: The age of consent: మహిళల సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16కి తగ్గించాలి.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గుముఖం పడుతూ సీనియర్ నేతలంతా కలిసికట్టుగా ఒకే వేదికపై పనిచేస్తూ ముందుకు సాగుతుండటం, భట్టి పాదయాత్ర కాంగ్రెస్ ను అధికారంలో కూర్చుబెట్టేలా చేస్తుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి భట్టి విక్రమార్క అడుగులు ముందుకే తప్పా వెనక్కి తిరిగి చూడలేదు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి వచ్చిన పండుగలను ప్రజలతోనే జరుపుకున్నారు.