Site icon NTV Telugu

Bhashyam: వరద బాధితుల సహాయార్ధం “భాష్యం” రూ.4 కోట్ల విరాళం..

Bhashyam

Bhashyam

ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ‘భాష్యం’ విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. ఆపన్నులను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహాయమందించేందుకు విద్యాసంస్థల తరపున మొత్తం రూ. 4 కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చందబ్రాబునాయుడును కలిసి భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం సాకేత్ రామ్ ల చేతుల మీదుగా అందజేశారు.

Read Also: DKZ TECHNOLOGIES FRAUD: హైదరాబాద్ లో భారీ మోసం.. పెట్టుబడుల పేరుతో రూ.700 కోట్లకు టోకరా

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చూపిన చొరవ అభినందనీయమన్నారు. మేము సైతమంటూ ఆపన్నులను ఆదుకోవడంలో భాష్యం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తన పిలుపు మేరకు స్పందించి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు భాష్యం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు.

Read Also: Chittoor District: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య..

Exit mobile version