NTV Telugu Site icon

Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..

Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.

Accident: ఓవర్‌టేక్ చేస్తూ బైక్, ఆటోని ఢీకొట్టిన స్కార్పియో.. ఏడుగురు దుర్మరణం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భావనతో గత 7 ఏండ్లుగా భారతమాతకి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా హారతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమం.. ఇది ఏ సంస్థకు చెందింది కాదని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా మహా హారతి కార్యక్రమంను ఆనవాయితీగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేయడానికి భారతమాత ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

Pakistan: న్యూమోనియాతో పాకిస్తాన్‌లో 200 మంది పిల్లలు మృతి..

అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. భాగ్యనగరంలో భారతమాతకి మహా హారతి 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశం వారు దేశాన్ని తండ్రిగా భావిస్తారు.. కానీ మన దేశంలో తల్లిగా భావిస్తామని అన్నారు. మన దేశంలో మాతృభూమికి అంతటి గొప్పతనం ఉంది.. వేరే ఇతరులకు ఆ సాంస్కృతి లేదని పేర్కొన్నారు. మనం భారతీయులుగా ఉండడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. భారత భూమికి భారత మాత మృతికకు ఉండే గొప్పతనం అని తెలిపారు. భారత దేశానికి రెండు గొప్పతనాలు ఉన్నాయి. ఒకటి మట్టికి పరిమళం.. ఇంకోటి రుచి ఉన్నది మట్టిలోనని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను ఇక్కడి మట్టిలో ఉన్న పరిమళం మరి ఎక్కడ లేదన్నారు. మన మట్టిలో పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ, రుచి, మంచి పనులు చేయాలనే పరిమళం ఉంటుందని చినజీయర్ అన్నారు.