Site icon NTV Telugu

Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్

Nasal Vaccine

Nasal Vaccine

Nasal Vaccine: ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా నాసల్ వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించింది. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఒక డోస్‌ ధర రూ.800గా నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో నాసల్ వ్యాక్సిన్‌ ధర రూ.325గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్రం ఆమోదించింది. దీనిని కొవిన్ యాప్‌లో చేర్చారు. కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్‌ బుక్ చేసుకోవచ్చు. భారత్ బయోటెక్ నాసల్ టీకాను ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఇచ్చే విషయంపై స్పష్టత లేదు.

Brain Eating Amoeba: మెదడును తినే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు

ఈ నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్‌గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ టీకా వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే అడ్డుకునేలా ఇది చేస్తుంది. దీనిని ప్రికాషనరీ డోస్‌గా ఆమోదించారని జాతీయ సాంకేతిక సలహా మండలి ఛైర్మన్ ఎన్కే అరోరా వెల్లడించారు.

Exit mobile version