Site icon NTV Telugu

Bharat Bandh: నేడు భారత్ బంద్.. సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారంటే..?

Bharat Bandh

Bharat Bandh

Bharat Bandh: దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్‌ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ బంద్‌ చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఒక ప్రకటనలో కోరింది.

Read Also:Nimisha Priya: యెమెన్ లో భారతీయ నర్సుకు ఉరి శిక్ష తేదీ ఖరారు.. నేరం ఏంటి..?

బంద్‌లో ఎవరు పాల్గొంటున్నారు?
బ్యాంకింగ్, బీమా, పోస్టల్, మైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు రాష్ట్ర రవాణా, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అనధికారిక లేదా అసంఘటిత రంగాల యూనియన్లు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతాయని ప్రకటించారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్‌జిత్ కౌర్‌ ప్రకారం.. రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా రాబోతున్నారు.

ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు భర్తీ చేయడం, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టించడం, అలాగే MNREGA వేతనాల పెంపు, పని దినాల పెంపు, ఇంకా పట్టణాల్లో కూడా ఈ తరహా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం వంటి విషయాలపై డిమాండ్లను ఉంచాయి.

Read Also:AI+ Smartphone Launch: మార్కెట్లోకి దేశీ స్మార్ట్‌ఫోన్‌.. బెస్ట్ ఫీచర్స్, ధర కేవలం 5 వేలే!

ప్రజా సేవలపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ బంద్‌ కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, రాష్ట్ర రవాణా వంటి సేవలు ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే, బ్యాంకులు పూర్తిగా మూసివేయబడతాయా..? లేదా..?, రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుందా అనే అంశాల్లో స్పష్టత లేదు. బ్యాంకింగ్, రైల్వే యూనియన్లు ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించలేదు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా పనిచేసే అవకాశమున్నప్పటికీ.. బస్సులు, టాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్ సేవలు తదితర ప్రజా రవాణా సేవలపై ప్రభావం తప్పదు.

Exit mobile version