నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమా మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అయితే భావించారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 5 న విడుదల చేయాలనీ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ 30న రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాకపోవడంతో ఈసారి కూడా రీరిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ సినిమాను లెజెండ్రి దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించారు.ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది.క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ భైరవ ద్వీపం మూవీని రీ రిలీజ్ చేయాలని అయితే భావించారు. ఈ మూవీని నవంబర్ లో రీ రిలీజ్ చేస్తున్నట్లు వారు తాజాగా ప్రకటించిన విడుదల తేదీ మాత్రం వెల్లడించలేదు..మరి ఈ సినిమా నవంబర్ లో అయినా విడుదల అవుతుందో లేదో చూడాలి.ఈ సినిమా వాయిదాపడటంతో బాలయ్య అభిమానులు ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 1 న విడుదల కానుంది.