Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో యువతను మంత్రముగ్ధులను చేసింది. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీకి మాత్రం విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తన అందంతో అబ్బాయిల మనసు దోచుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్న సమయంలోనే ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో యారియాన్ 2 తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు హరీష్ శంకర్ దృష్టి పడింది. దాంతో మాస్ మహారాజ్ రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ కోసం సెలక్ట్ చేశారు.
Read Also: Manmohan Singh: మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం
అమ్మడికి ఉన్న క్రేజ్ కారణంగా వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న భాగ్య శ్రీ ఆ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టేలా ఉంది. విజయ్ సినిమాలో హీరోయిన్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఇక మరోపక్క దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమా కూడా చేస్తుంది భాగ్య శ్రీ. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాతో భాగ్య శ్రీ మళ్లీ చర్చల్లో నిలుస్తుంది. అలాగే ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ సినిమాలో సైతం అమ్మడు సెలక్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి.
Read Also: UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట
ఇది అలా పక్కన పెడితే అటు విజయ్, ఇటు దుల్కర్ ఇద్దరితో అమ్మడు తెర మీద కనిపించబోతుంది. ఈ రెండిటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కచ్చితంగా భాగ్య శ్రీకి మంచి క్రేజ్ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే భాగ్య శ్రీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. అటు సినిమాలు ఇటు ఫోటో షూట్స్ రెండింటిలో భాగ్యం అందాలు చూసి ఆడియెన్స్ అబ్బా అంటున్నారు. ఒక సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు అంతా సైడ్ అయిన ఈ టైం లో వచ్చిన ప్రతి అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం భాగ్య శ్రీ బోర్సే కి తిరుగు ఉండదని చెప్పొచ్చు. ముఖ్యంగా అమ్మడి గ్లామర్ షోకి సెపరేట్ క్రేజ్ ఏర్పడుతుంది కాబట్టి అమ్మడు అదే రేంజ్ లో రెచ్చిపోతే ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు.