మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను రూపొందించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని, బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్‌ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక పవర్‌ఫుల్ పాయింట్‌ను కూడా అనిల్ రివీల్ చేశారు.
భగవంత్ కేసరి క్యారెక్టర్ అసలు పోలీస్ ఆఫీసర్‌గా మారకముందు ఏం జరిగింది? ఆయన గతం ఏంటి? అనే అంశాలతో ‘ప్రీక్వెల్’ తీస్తే కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రాబోయే చిత్రంలో బాలయ్యను మళ్ళీ పోలీస్ యూనిఫాంలో చూసే అవకాశం ఉందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే చిరంజీవి సినిమాతో కెరీర్ బెస్ట్ సక్సెస్ అందుకున్న అనిల్, ఇప్పుడు బాలయ్యతో మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతుండటంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అయిన అనిల్, ఈ ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తారో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
