Bhagavanth Kesari : సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య మూవీ.. రన్నింగ్ టైం ఎంతంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా చందమామ కాజల్ అగర్వాల్ నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించగా.. ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా రామ్‍ప్రసాద్ అలాగే ఎడిటర్ గా తమ్మి రాజు పని చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా టికెట్ల బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో భగవంత్ కేసరి సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.
తాజాగా సెన్సార్ సర్టిఫికషన్ వచ్చేసింది.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ కూడా ప్రకటించింది. భగవంత్ కేసరికి యూ/ఏ వచ్చిందంటూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది..భగవంత్ కేసరి చిత్రంలో ఒక్క కట్ కూడా చేయాలని సెన్సార్ బోర్డు మూవీ యూనిట్‍కు చెప్పలేదట. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ కంప్లీట్ అయిందని సమాచారం. ఇక, భగవంత్ కేసరి సినిమా రన్ టైమ్ (నిడివి) 164 నిమిషాల 30 సెకన్లు (2 గంటల 44 నిమిషాల 30 సెకన్లు)గా ఉంది.ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీ టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. చాలా చోట్ల తొలి రోజు కొన్ని షోలకు థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. బాలయ్యను ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈ చిత్రంలో చూపించానని అనిల్ ఇటీవల చెప్పుకొచ్చారు.ట్రైలర్ చూపించినట్లుగా తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..