Site icon NTV Telugu

TS Ministers: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు

Sri Rama

Sri Rama

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాముడు కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాపాలన అందిస్తుందన్నారు. మతసామరస్యానికి సైతం పేరుగాంచిన దేవాలయం భద్రాద్రి రామాలయం.. ఆనాటి ముస్లిం రాజైనటువంటి తానీషా ప్రభువు, హిందూ దేవుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ముత్యాల తలంబ్రాలు పంపించాడు.. ఇటువంటి లౌకికవాదానికి ప్రతీకగా నిలిచిన రామాలయాన్ని దర్శించుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచుతాం.. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామన్నారు. తమది పీపుల్స్ ప్రభుత్వమని.. ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం కూడా అదేనని మంత్రి భట్టి పేర్కొన్నారు.

Read Also: Hyderabad: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శించుకున్నానని, ఇప్పుడు ఫలితాలు అనంతరం కృతజ్ఞతగా వచ్చి తిరిగి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ప్రజా కంటకమైన రాక్షస పాలన ముగిసింది.. నేటి నుండి ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, రామరాజ్యం తరహాలో ప్రజలకు పాలన అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. మరోవైపు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలిస్తామని చెప్పారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బలాన్ని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును కోరుతున్నామని ఆయన తెలిపారు.

Read Also: Prithviraj Sukumaran: సలార్ కోసం.. వరద మొట్టమొదటిసారి ఆ పనిచేశాడంట..

Exit mobile version