NTV Telugu Site icon

Viral Video : రైలులో మట్టి నింపిన నకిలీ పవర్ బ్యాంక్‌ల విక్రయం..వీడియో వైరల్

New Project (1)

New Project (1)

రైలులో ప్రజలు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు తినుబండారాలు, నీళ్లు, ఇయర్‌ఫోన్‌లతో సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అమ్ముతుంటారు. కానీ ఈ విక్రయదారులు చాలా మంది ప్రయాణికులను మోసం చేయడానికి వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి ప్రయాణికులకు పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. విక్రయదారుడు దాని ధరలను రూ.500, రూ.550గా పేర్కొన్నాడు. అప్పుడు ఓ ప్రయాణికుడు పవర్ బ్యాంక్ నకిలీదిగా గుర్తించాడు.

READ MORE:NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌తో తేజస్వీ యాదవ్‌కు సంబంధం ఉంది..

రైలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక్క నిమిషం వీడియో వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ‘స్కామ్ 2024’ అని పిలుస్తున్నారు. వీడియోలోని వివరాల ప్రకారం.. సేల్స్‌మ్యాన్ రైలులో వచ్చి పవర్ బ్యాంక్ కావాలా వద్దా అని ఒక ప్రయాణికుడిని అడుగుతాడు. ఇది కంపెనీకి చెందిన పవర్ బ్యాంకేనా అని ప్రయాణికుడు అడుగుతాడు. విక్రయదారుడు అవునని సమాధానమిస్తాడు. ఏడాది గ్యారెంటీ ఉందని చెప్పాడు. రూ.500 నుంచి రూ.550 రేంజ్ లో తన వద్ద చాలా పవర్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పాడు. కొన్ని కంపెనీ పేర్లతో ఉన్న నకిలీ పవర్ బ్యాంకులను ప్రయాణికుడికి చూసిప్తాడు. ప్యాసింజర్‌ బేరం ఆడటంతో పవర్ బ్యాంక్‌ని రూ.300కి ఇచ్చేందుకు అంగీకరిస్తాడు విక్రయదారుడు. దీని తర్వాత ప్రయాణీకుడు పవర్ బ్యాంక్‌ వెనక భాగం నుంచి తెరిచి చూస్తాడు.

READ MORE: Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!

అది పూర్తిగా మట్టితో నిండి ఉంటుంది. ప్రయాణికుడు ఇలా చేస్తాడని దాన్ని అమ్మే వ్యక్తి అనుకోలేదు. దాన్ని ప్రయాణికుడి నుంచి లాక్కునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌కి సంబంధించిన క్యాప్షన్‌లో ‘పవర్ బ్యాంక్‌లో మట్టి కనిపించింది. జాగ్రత్త.’ ఓ వినియోగదారు ద్వారా పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్”లో భాగస్వామ్యం చేసారు. దీనికి ఇప్పటి వరకు 3.29 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా 3.3 వేల మంది లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్ట్‌పై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.