NTV Telugu Site icon

Best Recharge Plan 2023: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 84 రోజుల పాటు 2 GB డేటా, అపరిమిత కాలింగ్!

Reliance Jio

Reliance Jio

Reliance Jio Rs 719 Plan Details: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లో కస్టమర్‌లకు చాలా మంచి ఆప్షన్‌లు ఉన్నాయి. అయినా కూడా కస్టమర్లు ఎప్పటికప్పుడు ఉత్తమమైన రీఛార్జ్‌ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. మంచి వ్యాలిడిటీతో పాటు బలమైన ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం అన్ని ఫీచర్లతో కూడిన ఓ ప్లాన్‌ని జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు మంచి వ్యాలిడిటీని పొందడమే కాక.. మరిన్ని ప్రయోజనాలు కూడా అందించబడతాయి. ఆ ప్లాన్ వివరాలను ఓసారి చూద్దాం.

పైన చెప్పబడిన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్ ధర రూ. 719. ఇందులో 84 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2 GB డేటాను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుంది. అంటే మొత్తం 168 GB మీకు ఇవ్వబడుతుంది. వినియోగదారులు అపరిమిత 5G డేటాను ఉపయోగించవచ్చు. 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్ రూ. 719లో వినియోగదారులు ప్రతిరోజూ 100 SMSలను ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ మరియు జియో క్లౌడ్ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో అందించబడుతుంది. ఈ ప్లాన్ నెలవారీ ఖర్చు రూ. 240. మీరు ప్రతి నెలా 200 నుంచి 500 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎంచుకున్నా..ఇందులో దాదాపుగా ఇలాంటి ప్రయోజనాలే ఉంటాయి. కాబట్టి ఈ ప్లాన్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతిసారీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఇంటర్నెట్ మరియు కాలింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఈ రీఛార్జ్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. జియో వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Kodak CA Pro 65-inch TV: అతి తక్కువ ధరకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. బెస్ట్ ఫీచర్స్!

Also Read: Nothing Phone (2) Launch 2023: ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ ఆర్డర్‌ పాస్‌.. ఫోన్ నచ్చకుంటే మొత్తం రిఫండ్‌!