NTV Telugu Site icon

Baby Care : పసిపిల్లలకు ఇలా అస్సలు చేయకూడదు..

Baby Care

Baby Care

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే.. వారిపై చూపే శ్రద్ధ అంతా ఇంతాకాదు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటారు. అయితే.. అదే సమయంలో కొన్ని పొరపాట్లను తెలియకుండానే చేసేస్తుంటారు. పసిపిల్లలను కొంచెం పెద్దగా పెరిగే వరకు కొన్ని అస్సలు చేయకూడని పనులు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లల్ని పడుకోబెట్టే విధానం : పిల్లలను పడుకోబెట్టే విధానం కూడా వారిపై ప్రభావం చూపుతుంది. అయితే.. పసిపిల్లల్ని బోర్లా పడుకోబెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల సడెన్‌ ఇన్‌ఫాన్ట్‌ డెత్‌ సిండ్రోమ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలను వెల్లకిలా మాత్రమే పడుకోబెట్టాలని సూచిస్తున్నారు.

ముక్కులో ఆయిల్‌ వేయవద్దు : చిన్నపిల్లలకు ముక్కులో, చెవుల్లో నూనె వేయాలని చెబుతుంటారు మన పూర్వీకులు. అయితే.. ఈ అలవాటు మంచిది కాదని అంటున్నారు వైద్యులు. నూనెల్లో ఉండే రసాయనాల వల్ల పసిపిల్లల్లో ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

చెవుల్లో ఈయర్‌ బడ్స్‌ : పిల్లలకు స్నానం చేయించిన తరువాత..చెవుల్లో, ముక్కుల్లో నిలిచిన నీరు శుభ్రం చేసేందుకు ఎక్కువగా ఈయర్‌ బడ్స్‌ వాడుతుంటారు. కానీ ఈ అలవాటు ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఈయర్‌ బడ్స్‌ వినియోగం వల్లే పిల్లలకు వినికిడి శక్తికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.

బొడ్డుకు జాగ్రత్తలు : నవజాత శిశువుల బొడ్డు త్వరగా ఆరాలని నూనె, ఆవుపేడ, తేనే, నెయ్యిలాంటివి రాస్తుంటారు. కానీ.. చాలా ప్రమాదకరమైందంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల బొడ్డు భాగంలో ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దానికదే బొడ్డు రాలిపోతుందని దానిగురించి ఎలాంటి ద్రవాలు రాయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా. బొడ్డు భాగంలో ద్రవం లాగా ఏమైనా కారుతున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి

మిల్క్‌ బాటిల్‌ తీసేయండి : అయితే.. రాత్రి సమయంలో పిల్లలు ఏడుస్తున్నారని పాల బాటిల్‌ ఇచ్చేస్తుంటారు. అయితే.. పాలు త్రాగడం అయిపోయినాక ఖాళీ బాటిల్‌ను వెంటనే తీసివేయడం ఉత్తమం. బాటిల్‌ నిప్పల్‌ను ఎక్కువసేపు నోట్లోనే ఉంచడం వల్ల పిల్లల చిగుర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 

పిల్లల్ని ఊపడం : పిల్లలు ఏడుపు ఆపేందుకు ఎక్కువగా ఊపుతుంటారు. కానీ.. అలవాటు మంచిది కాదంట. పిల్లలను ఏడుపు మాన్పించేందుకు పిల్లల్ని ఎత్తుకుని ముందుకు, వెనక్కీ ఊపడం వల్ల పిల్లల సున్నితమైన నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ అలవాటు మానుకుంటే మంచిది.

<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>