Site icon NTV Telugu

Kidney Infection : కిడ్నీ ఇన్ఫెక్షన్‌ నివారించే ఇంటి చిట్కాలు

Kidney Infaction

Kidney Infaction

Health Tips for Kidney Infection

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణం అయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు శరీరంలో జరిగి జీవక్రియ అయిన ఏర్పడే వ్యర్ధ పదార్ధాలు కావచ్చు.. మరేదైనా సరే వాటిని అప్పటికప్పుడే తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్ని శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు. అవి ఒకసారి పనిచేయమని మొరాయిస్తే ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యమైన కిడ్నీల ను కాపాడుకోవాలంటే ముందు జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలి. మూత్రాశయం మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్ఫెక్షన్‌ల కారణంగా వస్తాయి. మూత్రపిండాల కు అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో ఇతర భాగంలో ఇన్ఫెక్షన్‌ సోకడం, చీము గడ్డలు, టీబీ మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలు చేరడం మొదలైన కారణాల వల్ల వీటికి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ న్యాచురల్‌గా ఎలా నివారించాలి? రేనల్‌ ఇన్ఫెక్షన్‌ నివారించడానికి కొన్ని హోమ్‌ రెమిడీస్‌ ఈ క్రింది వాటిలో గమనించి మీరు మీ రెగ్యులర్‌ డైట్‌తో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్‌ తగ్గించుకోవచ్చు. అలోవేరా చాలా అద్భుతమైన మూలిక.

దీనిని ప్రతిరోజు కొద్దిగా తీసుకునట్లయితే.. ఇది మూత్రపిండాలు చాలా ఎఫెక్టీవ్‌గా క్లీన్‌ చేసి టాక్సిస్‌ను తొలగిస్తుంది. నీళ్లు త్రాగాలి మన శరీరంలో నిరంతరం తేమగా ఉంచడం వల్ల కిడ్నీలో రాళ్లు రావడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలను మరింత స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు యురిన్‌ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినరల్స్‌, సోడియం ఫ్లష్ చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. హెర్బల్‌ జ్యూస్‌ మరో మంచి ఔషధం. ఇది ఇన్ఫెక్షన్‌లు నివారించడంలో ఎఫెక్టీవ్‌గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్‌ జ్యూస్‌.. యురినరీ ట్రాక్స్‌ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో యాసిడిక్‌ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్‌, నిమ్మ, ద్రాక్షా వంటి విటమిన్‌ సీ అధికంగా ఉన్నవి కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆరెంజ్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

బేకింగ్‌ సోడా.. చాలా ఎఫెక్టీవ్‌ హోమ్‌ రెమెడీ. ఈ ఇది కిడ్నీలో బైకార్బోనేట్‌ లెవల్స్‌ను కిడ్నీలో నింపడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి ప్రతిరోజు త్రాగడం వల్ల కిడ్నీ ఇన్పెక్షన్‌ తగ్గుతుంది. వెల్లుల్లి కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్‌ తగ్గించే దానిలో ఇది ఉత్తమమైన ఇంటి మందు. ఈ మొక్క ఘాటైన వాసన కలిగిన న్యూచురల్‌ హోమ్‌ రెమెడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఎలాసీన్‌ అనే యాక్టివ్‌ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లామటరీతో పాటు యాంటీ ఫంగస్‌ ఏజెంట్‌ పుష్కలంగా ఉన్నాయి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వలన కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది.

 

Exit mobile version