చలిని తగ్గించే ఆహారం ఏంటో తెలుసా? చలికాలం వస్తే అందరూ వేడిగా ఉండే ఆహారాన్ని తినటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే మరి వేడిగా ఉండే ఆహార పదార్ధాలు తినటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే మరి చలికాలంలో ఆహారం తింటే శరీరానికి వేడిని అందిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Tips For Asthma In Winter : చలికాలంలో ఆస్తమాతో జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి..!
దుంపలు: దుంపలు చక్కటి కౌషిక ఆహారమే కాకుండా శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఎందుకంటే వీటిలో పీచు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్ ఏ, సీ, ఖనిజలవణాలు, మాంగనీస్ రాగి అధికంగా లభిస్తాయి. వీటిని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తరచూ తీసుకుంటే చలికాలంలో ఎదురయ్యే అనారోగ్యాలకు దూరంగా ఉండాలి.
Also Read : Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!
పాలకూర : ఆకుపచ్చని కాయగూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లభిస్తాయి. ఈ కూరలో ఇంకా ఇనుము, కాల్ష్యియం సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజు పాలకూరని ఉడికించి కానీ రసం రూపంలో తీసుకునే అలవాటు చేసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నువ్వులు: నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే వేడిని అందిస్తాయి. వీటిలో కాల్ష్యియం, ఖనిజలవణాలు, మాంగనీస్, ఇనుము, మెగ్నిషియం, రాగి సమృద్ధిగా లభిస్తాయి. నువ్వులతో తయారు చేసిన పదార్థాలను భోజనం తర్వాత తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. ఇవి చర్మాన్ని తేమను అందించడానికి తోడ్పడతాయి.
వేరు శనగలు : ఈ గింజల్లో విటమిన్ బీ3 లభిస్తుంది. అలానే గుండెకు మేలు చేసే మెను, సాట్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది. వేరుశనగ గింజలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అవి చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి.
జొన్నలు: జొన్నలను కనీసం వారంలో ఒక్కరోజు అయినా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇందులో కాల్ష్యియం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కండరాల కదలిక చక్కగా ఉంటుంది. నొప్పులు కూడా దూరంగా ఉంటాయి. జొన్నతో చేసే పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతటి పోషక విలువలు, ఆహార పదార్థాలు తింటూ చలికాలంలో వచ్చే సమస్యల నుండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.