రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Also Read: Moto G55 Launch: మోటో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్ అదుర్స్, ధర తక్కువే!
బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ రూ.997 వ్యాలిడిటీ 160 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ సౌకర్యం ఉంది. జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసులను అందించే ప్రతి సర్కిల్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.