NTV Telugu Site icon

Best 5G Smartphones: 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్స్ అదుర్స్ అంతే!

Best 5g Smartphones

Best 5g Smartphones

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్‌’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్‌ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Motorola Edge 50 Neo:
బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్న వారి కోసం ఈ ఫోన్ మంచి ఎంపిక. 6.4 ఇంచెస్ ఫ్లాట్‌ ఎల్‌టీపీఓ పీఓల్‌ఎఈడీ ప్యానెల్‌, 1.5K రిజల్యూషన్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఐపీ68 రేటింగ్‌, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7300 ప్రాసెసర్‌ ఇందులో ఉన్నాయి. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4310 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ రూ.21,999కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

Nothing Phone 2a:
నథింగ్‌ ఫోన్‌ 2ఏ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.5, 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌, 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు బ్యాక్ కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

Also Read: Tollywood Heroes: నెక్స్ట్ వెయ్యి కోట్లు కొల్లగొట్టేది ఈ హీరోలే!

Honor X9b:
హానర్‌ ఎక్స్‌9బి అమెజాన్‌లో రూ.24,998కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ 13తో ఔటాఫ్‌ది బాక్స్‌, 6.78 ఇంచెస్ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1.5కె రిజల్యూషన్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, 108 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5800 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఇది వచ్చింది.

OnePlus Nord CE 4:
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 సూపర్ ఎంపిక. ఈ ఫోన్ అమెజాన్‌లో 22,999కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఓఎస్‌, 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌, వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌, ముందువైపు 16 ఎంపీ కెమెరా, 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇందులో ఇచ్చారు.