Budget 5G Smartphones 2024: తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?.. 15 వేల్లోపు బెస్ట్‌ ఫోన్లు ఇవే!

  • ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌
  • అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌
  • మీ బడ్జెట్‌ 15 వేల్లోపే ఉంటే
Best 5g Smartphones

Best 5g Smartphones

Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌’, అమెజాన్‌లో ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు సేల్స్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్‌ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్‌ కొనాలనుకుని?.. మీ బడ్జెట్‌ 15 వేల్లోపే ఉంటే ఈ ఫోన్లు ఓసారి చూడండి.

15 వేల్లోపు ఫోన్ల లిస్ట్:
శాంసంగ్‌ ఎం35 5జీ అమెజాన్‌లో రూ.13,749కే లభిస్తుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఇందులో ఉంటాయి.
మోటోరొలా జీ64 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కు లభిస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఉంది.
అమెజాన్‌లో నార్జో 70 ప్రోను రూ.14,999కు.. రియల్‌మీ నార్జో 70 ఎక్స్‌ రూ.12,498కి అందుబాటులో ఉంది.
ఒప్పో కే12ఎక్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999కే లభిస్తుంది. 32 ఎంపీ కెమెరా, 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్‌ వస్తోంది.
లావా బ్లేజ్‌ కర్వ్‌ అమెజాన్‌లో రూ.14,499కే లభించనుంది. 64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది.

Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే!

10వేల ఫోన్లు ఇవే:
శాంసంగ్‌ ఏ14 5జీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కే లభించనుంది.
మోటొరొలా జీ34 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కే లభించనుంది.
ఐకూ జడ్‌ 9 లైట్‌ అమెజాన్‌లో రూ.9,499కే లభిస్తుంది.
రెడ్‌మీ 13సీ 5జీ అమెజాన్‌లో రూ.8,999కే లభించనుంది.