NTV Telugu Site icon

Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం

Cab Driver

Cab Driver

Cab Driver: బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అతడిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతిరా పురుషోత్తమన్ జులై 21న ట్విట్టర్‌లో తన కష్టాలను పంచుకున్నారు. బెంగళూరులోని టౌన్ హాల్‌లో మణిపూర్ హింసాకాండకు నిరసనగా తాను వెళ్లానని, వేదిక నుండి ఇంటికి వెళ్లడానికి ఆన్‌లైన్‌ యాప్‌లో ఆటోను బుక్ చేసుకున్నానని చెప్పారు. అయితే అనేక సార్లు రైడ్‌ రద్దు కావడంతో ఆమె బైక్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

Also Read: Success Story: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి..కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న రైతు..

ఈమె బైక్‌ బుక్ చేసుకోగా.. డ్రైవర్‌ వేరొక బైక్‌పై వచ్చాడు. యాప్‌లో రిజిస్టర్ అయిన బైక్‌ సర్వీసింగ్‌లో ఉందని డ్రైవర్‌ చెప్పాడు. దీంతో నా బుకింగ్‌ను ధ్రువీకరించడంతో అక్కడి నుంచి రైడ్‌ను కొనసాగించినట్లు ఆ మహిళ తెలిపింది. చుట్టూ ఇతర వాహనాలు లేని ఏకాంత ప్రాంతంలో డ్రైవర్‌ బైక్‌ నడుపుతూ హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడని ఆమె వెల్లడించింది. తాను భయపడి మౌనంగా ఉన్నానని పేర్కొంది. ఇంటి లొకేషన్ తెలవకుండా ఉండడానికి గమ్యస్థానానికి 200 మీటర్ల ముందే దిగిపోయానని తెలిపింది. రైడ్‌ ముగిసిన తర్వాత కూడా క్యాబ్‌ డ్రైవర్‌ వాట్సాప్‌ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. ఈ వేధింపులను ఆపడానికి క్యాబ్‌ డ్రైవర్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ వాట్సాప్‌ చాట్‌కరు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ఆమె పంచుకున్నారు. ఈ వాట్సాప్‌ చాట్‌లో డ్రైవర్ హార్ట్, ముద్దుల ఎమోజీలను ఉపయోగించాడు. ఆ మహిళకు లవ్‌ యూ అని కూడా చెప్పాడు.

Also Read: Karnataka Congress MLA : సీఎంను ఎలా దించాలో తెలుసు.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఆమె రాపిడో భద్రతా చర్యలను మరింత ప్రశ్నించింది. ఆ వ్యక్తి తనకు అనేక నంబర్ల నుండి కాల్ చేస్తూనే ఉన్నాడని పేర్కొంది. మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాపిడో యాజమాన్యాన్ని ప్రశ్నించింది. మీ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. దయచేసి మీ సేవతో నమోదు చేసుకున్న వ్యక్తులు సురక్షితమైన ప్రయాణ అనుభవం కోసం విశ్వసించబడతారని నిర్ధారించుకోండంటూ పేర్కొంది. “అతను ఇప్పటికీ నాకు వివిధ నంబర్‌ల నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు!” అని ఆమె ట్వీట్ చేసింది. బెంగళూరు పోలీసులు జూలై 22న ఈ విషయాన్ని గమనించారు. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని గమనించి రాపిడో బైక్‌ డ్రైవర్‌గా వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.