NTV Telugu Site icon

Elephant Video Viral : రోడ్డుపై బైక్ పెడతారా బుద్ధిలేదు.. తన్ని అవతలేసిన ఏనుగు

Elephant

Elephant

Elephant Video Viral : బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ ను తొండంతో విసిరిపారేసింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు డీసీపీ(ట్రాఫిక్) కళా కృష్ణస్వామి ఈ వీడియోను షేర్ చేస్తూ.. రోడ్లపై వాహనాలు పార్క్ చేయొద్దని కోరారు. వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్ లో జరిగింది. సిటీలోని ఓ రోడ్డుపై మూడు బైకులున్నాయి. అందులో ఒకటి రోడ్డు మీదే ఉండగా.. మిగతా రెండు మాత్రం కాస్త పక్కగా ఫుట్ పాత్ పై పార్క్ చేశారు.

Read Also: Funny Thiefs : దొంగతనం చేసి పోలీసులకే ఫోన్ చేశారు.. ఇంకేముంది

ఇంతలో అక్కడికి ఓ ఏనుగు పరుగులు పెడుతూ వచ్చింది. దానిని చూసి అక్కడున్న జనం పరుగులు తీయగా.. ఆ ఏనుగు మాత్రం రోడ్డు మీద పార్క్ చేసిన బైక్ ను తొండంతో విసిరేసింది. ఆ పక్కనే ఉన్న రెండు వాహనాల జోలికి మాత్రం వెళ్లలేదు. అంతే.. వచ్చిన పని అయిపోయినట్లు తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. బెంగళూరు డీసీపీ(ట్రాఫిక్) కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో కొత్తగా విధుల్లో చేరిన ఏనుగు అని కొందరు.. చివరికి ఏనుగుకు కూడా ట్రాఫిక్ రూల్స్ తెలుసని మరికొందరు, బెంగళూరులో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏనుగులే మంచి ఆప్షన్ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తూ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.

Show comments